Home > తెలంగాణ > టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ కేసు.. తండ్రీకొడుకులకు బెయిల్

టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ కేసు.. తండ్రీకొడుకులకు బెయిల్

టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ కేసు.. తండ్రీకొడుకులకు బెయిల్
X

టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరికి బెయిల్ లభించింది. కేసులో నిందితులుగా ఉన్న తండ్రీ కొడుకులైన మైబయ్య, జనార్థన్ లకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు నిందితులిద్దరినీ ఏప్రిల్ 21న అరెస్ట్ చేశారు. తన కొడుకు జనార్థన్ కోసం మైబయ్య కేసులో ప్రధాన నిందితురాలైన రేణుక భర్త డాక్యా నాయక్ నుంచి ప్రశ్నాపత్రం కొనుగోలుచేశాడు. ఇందుకోసం డాక్యానాయక్ కు రూ.2లక్షలు చెల్లించినట్లు దర్యాపులో తేలింది. మైబయ్య, జనార్థన్ లకు బెయిల్ పంపడంతో ఇప్పటి వరకు బెయిల్ పొందిన వారి సంఖ్య 17కు చేరింది.

ఇదిలా ఉంటే టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు వరంగల్ జిల్లాకు చెందిన డీఈ పూల రమేష్​ అరెస్టుతో కీలక మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ఈ కేసులో సిట్ 50 మందిని అరెస్టు చేసింది. 17 మంది బెయిల్ పై బయటకు రాగా.. కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్​, రాజశేఖర్​ ఇంకా జైల్లోనే ఉన్నారు. మరోవైపు ఈ కేసులో 37 మంది పేర్లతో చార్జి షీట్ దాఖలు చేసేందుకు సిట్ సిద్ధమవుతోంది. ఏఈ ప్రశ్నపత్రాలను లీక్ చేసిన ఎన్పీడీసీఎల్ డీఈ పూల రమేశ్​ అరెస్టు తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది.

హైదరాబాద్లో తన భార్య పేరుతో కోచింగ్ సెంటర్ నడుపుతున్న రమేష్ ఏకంగా 80 మందికి ఏఈ ప్రశ్నపత్రం అమ్మినట్టు సిట్ అనుమానిస్తోంది. వారి వివరాలు కనుగొనే ప్రయత్నంలో ఉంది. సరైన ఆధారాలు లభించిన వెంటనే వారందరినీ అరెస్టు చేసేందుకు సిట్ సిద్ధమవుతోంది. న్యాయపరమైన చిక్కులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఛార్జ్ షీట్ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్న సిట్.. పూల రమేశ్ నుంచి ప్రశ్నపత్రం కొనుగోలు చేసిన వారి పేర్లతో తర్వాత అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.

Updated : 8 Jun 2023 7:27 AM GMT
Tags:    
Next Story
Share it
Top