హైదరాబాద్ బైక్స్.. నలుగురు బలి
X
మితి మీరిన వేగం నిండు ప్రాణాలను బలితీసుకుంటోంది. ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకండా ఎదుటివారి ప్రాణాలు కూడా తీస్తూ కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చుతున్నారు. హైదరాబాద్‌లో రెండు బైక్ ప్రమాదాల్లో నలుగురు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రెండు ప్రమాదాలకూ అతి వేగమే కారణం. బొల్లారంలో మార్నింగ్ వాక్ చేస్తున్న ఇద్దరు మహిళలు... వేగంగా వచ్చిన స్పోర్ట్స్ బైక్ ఢీకొట్టడంతో అక్కడిక్కడే చనిపోయారు. ఉప్పల్‌కు చెందిన ఆదిత్య అనే యువకుడు శామీర్ పేటలో జరిగే రేసింగ్ కోసం వేగంగా వెళ్తూ కంటోన్మెంట్ పార్క్ వద్ద అదుపుతప్పి రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను ఢీకొట్టాడు. ప్రమాదంలో ఇద్దరూ చనిపోయారు. మృతులను సాయికాలనీకి చెందిన పోలం బాలమణి, రిశాల బజార్‌కు చెందిన రాధికగా గుర్తించారు. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా ఆదిత్యను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబాగూడలో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు.
మహబూబ్ నగర్ జిల్లా పాలెం గ్రామానికి చెందిన కృష్ణ, మహేశ్ తోపాటు మరో యువకుడు ప్రధాన రహదారిపై వేగంగా వెళ్తూ బైక్ కరెంటు స్తంభాన్ని ఢీకొట్టారు. ప్రమాదంలో కృష్ణ, మహేశ్ తలలకు బలమైన గాయాలతో అక్కడిక్కడే మృతిచెందగా, మరు యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. చేతికొచ్చిన యువకులు చనిపోవడంతో, దిక్కులేని వాళ్లమయ్యామని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.