మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
X
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, నార్సింగి మండలం కాస్లాపూర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ లారీని, వెనుక నుండి మరొక కంటైనర్ లారీ ఢీకొట్టింది. దీంతో వెనుక ఉన్న లారీలో మంటలు చెలరేగి ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పివేశారు. మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన నాగరాజు, బసవరాజు గా గుర్తించారు. కాగా ఈ ప్రమాదం పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సరిగ్గా 40 రోజుల క్రితం కూడా నార్సింగ్ మండలంలోనే ఓ ప్రమాదం జరిగింది. మండలంలోని మల్లూరు వద్ద జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారును అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.