Home > తెలంగాణ > KTR : నేడు కేటీఆర్ ఆధ్వర్యంలో చలో మేడిగడ్డ’

KTR : నేడు కేటీఆర్ ఆధ్వర్యంలో చలో మేడిగడ్డ’

KTR : నేడు కేటీఆర్ ఆధ్వర్యంలో చలో మేడిగడ్డ’
X

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నేడు మేడిగడ్డ కార్యక్రమం చేపట్టినారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డపై ప్రజలకు వాస్తవాలు తెలియ పరిచే ఉద్దేశ్యంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులు కలిసి వెళ్లున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. 200 మందికి పైగా పార్టీ నేతలతో బస్సుల్లో బయలుదేరి వెళ్లి.. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించి.. అక్కడి నుంచే మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియపరుస్తామన్నారు. మరోవైపు ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్‌ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ నుంచి బస్సులో వస్తున్న కేటీఆర్‌ను వరంగల్‌ నేతలు జనగామ సమీపంలో నెల్లుట్ల వద్ద ఉదయం 10 గంటలకు స్వాగతం పలికి ర్యాలీగా మేడిగడ్డకు బయలుదేరి వెళ్లనున్నారు.చలో మేడి గడ్డ కార్యక్రమంపై కాంగ్రెస్ నాయకులు ఫైర్ అయ్యారు.

మేడి గడ్డ సందర్శనకు వెళ్లే ముందు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదో ప్రజలకు చెప్పాలని ప్రభుత్త విప్ రామంచద్ర నాయక్ డిమాండ్ చేశారు. ‘నేషనల్‌ డ్యామ్స్‌ అథారిటీ సూచనలు ఖాతరు చేయకుండా.. శాస్త్రీయత లేకుండా నిర్మించారు. మేడిగడ్డను బొందలగడ్డ అని పిలిచిన కేసీఆర్‌.. మరి బీఆర్‌ఎస్‌ నేతలను అక్కడికి ఎందుకు పంపుతున్నారో ప్రజలకు వివరణ ఇవ్వాలి’ అని డిమాండ్‌ చేశారు. మందుల సామెల్‌ మాట్లాడుతూ.. మాజీ మంత్రులు‘కేసీఆర్‌, హరీశ్‌లు మేడిగడ్డకు బొక్క కొట్టారు. దీన్ని చూడటానికి వెళ్తున్నారా కేటీఆర్‌..? కమీషన్ల కోసం కాళేశ్వరమని అన్నందుకు నాయిని నర్సింహారెడ్డికి టికెట్‌ ఇవ్వలేదని ఎమ్మెల్యే శామ్యూల్ ఆరొపించారు.మేడిగడ్డ సందర్మనకు బీఆర్‌ఎస్ నేతలు ఎందుకు వెళ్లుతారో ప్రజలకు సమాదనం చెప్పాలని సీపీఐ ఎమ్మెల్యే కునంనేని అన్నారు.‘మీ హయాంలోనే నిర్మించిన మేడిగడ్డ కుంగింది. అన్నారం బ్యారేజీలో పగుళ్లు ఏర్పడ్డాయి. మేడిగడ్డను బొందలగడ్డ అని.. అక్కడికే పంపుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిపుణులు ఏది చెబితే అది చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిపుణులు త్వరగా తేల్చితే పరిష్కారం దొరుకుతుంది’ అని అన్నారు.

Updated : 1 March 2024 7:34 AM IST
Tags:    
Next Story
Share it
Top