Modi TelanganaTour : గిరిజన యూనివర్సిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం..
X
ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పాలమూరు సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సమ్మక్క సారక్క పేరుతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ క్రమంలో ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. గిరిజన యూనివర్సిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా 900 కోట్లతో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు.
మొన్నటి మహబూబ్ నగర్ సభలో తెలంగాణకు మోదీ పలు హామీలు ప్రకటించారు. గిరిజన యూనివర్సిటీతో పాటు పసుపు బోర్డును ప్రకటించారు. పసుపు బోర్డుపై అటు రైతులు, ట్రైబల్ యూనివర్సిటీ పై తెలంగాణ ప్రభుత్వం పలుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. అయితే ఇన్నాళ్లు నాన్చుతూ వచ్చిన కేంద్రం ఎట్టకేలకు వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరికొన్ని రోజుల్లో తెలంగాణలో ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో మోదీ వీటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.ఈ హామీలు బీజేపీకి ఎంతవరకు మేలు చేస్తాయో వేచి చూడాలి.