Home > తెలంగాణ > ఈ నెల 28 న రాష్ట్రానికి అమిత్‌షా.. లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్

ఈ నెల 28 న రాష్ట్రానికి అమిత్‌షా.. లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్

ఈ నెల 28 న రాష్ట్రానికి అమిత్‌షా.. లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్
X

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 28వ తేదీన షా రాష్ట్రంలో పర్యటించబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొంగరకలాన్‌ గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ మండలాల అధ్యక్షులతో అమిత్ షా సమావేశం ఉంటుందని తెలిపారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అమిత్ షా తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఎన్నికల కార్యాచరణను ఆయన సిద్ధం చేయనున్నారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలకు లోక్‌సభ ఎన్నికల విష‍యంలో దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేయనున్నారు.

పది పార్లమెంటు నియోజకవర్గాలపై బీజేపీ దృష్టి పెట్టింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన నాలుగు స్థానాలతో పాటు... ప్రభావం చూపిన మరో ఆరు స్థానాలపై ఫోకస్ చేయాలని నిర్ణయించింది. అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలను అమిత్ షా నేతలకు వివరించనున్నారు. అమిత్ షా తర్వాత పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అమిత్ షా సమక్షంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు సహా కీలక నేతలంతా ఓటమి చెందారు. దీంతో లోక్‌సభ ఎన్నికలపై పార్టీ సీనియర్లకు షా కీలక సూచనలు చేయనున్నట్లు సమాచారం.

Updated : 25 Dec 2023 12:57 PM IST
Tags:    
Next Story
Share it
Top