Home > తెలంగాణ > మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ నాటకాలు ఆడుతోంది : Kishan Reddy

మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ నాటకాలు ఆడుతోంది : Kishan Reddy

మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ నాటకాలు ఆడుతోంది : Kishan Reddy
X

సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డకు వెళ్లడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని విమర్శించారు. రాహుల్, రేవంత్ రెడ్డి ఇప్పటికే మేడిగడ్డను పరిశీలించారని.. ఇప్పుడు వెళ్లింది పొలిటికల్ విజిట్ కోసమని సెటైర్ వేశారు. మేడిగడ్డ విషయంలో రాజకీయంగా లబ్ది పొందేందుకు కాంగ్రెస్ ట్రై చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ - కాంగ్రెస్ ఒక్కటేనని అన్నారు.

మేడిగడ్డ లోపభూయిష్ఠంగా ఉందని డ్యాం సేఫ్టీ అధికారులు చెప్పారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. డ్యాం సేఫ్టీ అధికారులు మేడిగడ్డను సందర్శించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. గతంలో డ్యాం సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదికనే రాష్ట్ర విజిలెన్స్ ఇచ్చిందని.. అందులో ఎటువంటి కొత్త విషయాలు లేవని విమర్శించారు. పార్టీ బహిరంగ సభకు వెళ్తున్న కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎంగా ఉన్నప్పుడు సచివాలయానికి కూడా కేసీఆర్ రాలేదన్నారు.

Updated : 13 Feb 2024 4:30 PM IST
Tags:    
Next Story
Share it
Top