Home > తెలంగాణ > వరంగల్‌లో సైకో హల్‌చల్.. కట్టేసి కొట్టారు

వరంగల్‌లో సైకో హల్‌చల్.. కట్టేసి కొట్టారు

వరంగల్‌లో సైకో హల్‌చల్.. కట్టేసి కొట్టారు
X

రాష్ట్రంలోని వరంగల్ నగరంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. కనిపించిన వారిని ఇష్టానుసారంగా కొట్టి గాయపరిచాడు. పుప్పాలగుట్ట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అతను ఎవరో అక్కడివారికి తెలియదు. కానీ అతడు నేరుగా ఓ ఇంట్లోకి చొరబడ్డాడు.. ఇంట్లో ఉన్నవారిపై రాయితో దాడి చేశాడు. దీంతో వారి అరుపులు విన్న స్థానికులు హడలెత్తిపోయారు. ధైర్యం చేసి అతన్ని పట్టుకొని చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి రెండు సంచులు చేత పట్టుకొని ఇంట్లోకి ప్రవేశించాడు. ఎవరు మీరని ప్రశ్నించడంతో అతడు ఆగ్రహం తో ఇంటి యాజమానిపై రాయితో దాడి చేశాడు. ఇంట్లో వారి అరుపులు విని ఇరుగు పొరుగు వారంతా అక్కడి చేరుకున్నారు. ఎవరని నిలదీయడంతో ఆసీఫ్ అనే మరోవ్యక్తిపై ఆ సైకో దాడికి పాల్పడ్డాడు. అతను కూడా తీవ్రంగా గాయపడ్డారు..

ఇక అంతా దైర్యం చేసి గ్రామస్తులు అతన్ని అతి కష్టం మీద పట్టుకుని ఓ స్తంభానికి కట్టేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి.. అతడ్ని తీసుకెళ్లారు. అయితే దాదాపు రెండు గంటల పాటు ఆ సైకో సృష్టించిన వీరంగంతో జనాలు భయంతో వణికిపోయారు.. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు.. పోలీసులు ప్రస్తుతం అతన్ని మానసిక వైద్యుల దగ్గర కు తీసుకెళ్లినట్లు తెలుస్తుంది.. ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..

Updated : 18 July 2023 1:49 PM IST
Tags:    
Next Story
Share it
Top