రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయని మొబైల్ నెట్వర్క్లు..
X
రాష్ట్ర వ్యాప్తంగా ఎయిర్టెల్, జియో, ఐడియా నెట్వర్క్ లు సరిగ్గా పనిచేయట్లేదు. మధ్యాహ్నం నుంచి ఫోన్ కాల్స్ కనెక్ట్ అవ్వక వినియోగదారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరికి కనెక్ట్ అయినా.. మాట్లాడుతుండగా మధ్యలోనే కట్ అవుతున్నాయి. మరికొందరికి ఫోన్ లో సిగ్నల్సే కనిపించడం లేదు. దీంతో వినియోగదారులు భారీ ఎత్తున సర్వీస్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. ప్రాబ్లమ్ ఏంటో తెలియక సిబ్బంది కూడా తలలు పట్టుకున్నారు. దీనిపై కంపెనీల నుంచి స్పందన రావాల్సి ఉంది. అయితే, నెట్వర్క్ సమస్య ఎప్పటికి పునరుద్ధరిస్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కాగా, కొందరికి కాల్స్ కనెక్ట్ కాకపోయినా.. ఇంటర్నెట్ మాత్ర పనిచేస్తోంది. దాంతో వాట్సాప్ ద్వారా ఇతరులకు కాంటాక్ట్ అవుతున్నారు. గతంలో ఇలా చాలాసార్లు జరిగినా.. కొన్ని ప్రాంతాల్లో, ఒక్కరిద్దరికి మాత్రమే సమస్య ఎదురయ్యేది. కాగా ప్రస్తుతం వినియోగదారులందరికీ ఒకేసారి ఈ సమస్య రావడం గమనార్హం.