Home > తెలంగాణ > కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పకుండా విచారణ జరుపుతాం - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పకుండా విచారణ జరుపుతాం - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పకుండా విచారణ జరుపుతాం - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

ఇరిగేషన్‌ శాఖపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆ శాఖలో చాలా దుర్మార్గం జరిగిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పకుండా విచారణ జరుపుతామన్న ఆయన.. తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదని హెచ్చరించారు. లక్ష కోట్లు ఖర్చు చేస్తే కేవలం లక్ష ఎకరాల ఆయకట్టు మాత్రమే పెరిగిందని ఉత్తమ్ విమర్శించారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు కోసం రూ. 25వేల కోట్లు, సీతారామ ప్రాజెక్టు కోసం రూ. 7కోట్లు ఖర్చు చేసినా కొత్తగా ఒక్క ఎకరా ఆయకట్టు కూడా అందుబాటులోకి రాలేదని అన్నారు.

మేడిగడ్డ పిల్లర్ కుంగడం క్రిమినల్ నగ్లిజెన్స్ అని ఉత్తమ్ అన్నారు. ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి నిర్లక్ష్యం చూడలేదని అన్నారు. ప్రాజెక్టును డిజైన్ చేసింది ప్రభుత్వమేనని ఎల్ అండ్ టీ సంస్థ చెబుతోందని చెప్పారు. డిజైన్ సరిగా లేదని ఆ సంస్థ చెబుతోందని అన్నారు. పెద్ద ప్రాజెక్టని పెద్ద పెద్ద మాటలు చెప్పారని అయినా ఫలితం లేకుండా పోయిందని ఉత్తమ్ వాపోయారు. మన కుటుంబాలను తాకట్టు పెట్టి అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టినా ప్రయోజనం శూన్యమని మండిపడ్డారు.

Updated : 20 Dec 2023 4:54 PM IST
Tags:    
Next Story
Share it
Top