Home > తెలంగాణ > మేడిగడ్డ బ్యారేజ్ పనులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

మేడిగడ్డ బ్యారేజ్ పనులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

మేడిగడ్డ బ్యారేజ్ పనులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష
X

మేడిగడ్డ బ్యారేజ్ పనులపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. సచివాలయంలో జరిగిన భేటీలో ఎల్ అండ్ టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్.వి. దేశాయ్ సహా పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. మేడిగడ్డకు బ్యారేజ్కు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎల్ అండ్ టీ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారీ ప్రాజెక్టులో నాసిరకం పనులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. నాణ్యత లేకుండా పనులు ఎలా చేశారని నిలదీశారు. ఒక అధికారికి లెటర్ ఇచ్చి ఇక మా ప్రమేయం లేదని తప్పించుకోవాలనుకుంటే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజా ధనాన్ని వృథా చేసి ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణమైన వారెవరనీ వదలిపెట్టమని తేల్చి చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.




Updated : 18 Dec 2023 10:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top