కాంగ్రెస్ రెండో జాబితా.. కీలక నేత రాజీనామా..
X
రెండో జాబితా ప్రకటనతో తెలంగాణ కాంగ్రెస్లో ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమంది. 45మందితో సెకండ్ లిస్ట్ విడుదలవ్వగా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నారు. కొంతమంది తమ అనుచరులతో భేటీ అయి భవిష్యత్ కార్యచరణను చర్చిస్తుండగా.. మరికొంత మంది నేతలు రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఎల్లారెడ్డి టికెట్ ఆశించిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీకి వడ్డేపల్లి సుభాష్ రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది. సుభాష్ ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ అధిష్టానం ఆ టికెట్ ను సీనియర్ నాయకుడు మదన్ మోహన్ రావుకు కేటాయించింది. దీంతో సుభాష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి జాజుల సురేందర్ కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గెలిపొందారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరగా.. నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ గా సుభాష్ రెడ్డి కొనసాగారు. ఇక మదన్ మోహన్ రావు గత సార్వత్రిక ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి ఆయన ఎల్లారెడ్డి పై ఫోకస్ పెట్టారు. సర్వేలు సహా సీనియర్ నేతలు సపోర్ట్ ఉండడంతో టికెట్ మన్ మోహన్నే వరించింది.
Vaddepally Subhash Reddy resigns to congress
Vaddepally Subhash Reddy,yellareddy,yellareddy congress ticket,Madan Mohan Rao,kamareddy,telangana congress,congress 2nd list,revanth reddy,tpcc chief,congress,telangana elections