Home > తెలంగాణ > తెలుగు రాష్ట్రాల రైళ్ళకు ధరల తగ్గింపు లేదు

తెలుగు రాష్ట్రాల రైళ్ళకు ధరల తగ్గింపు లేదు

తెలుగు రాష్ట్రాల రైళ్ళకు ధరల తగ్గింపు లేదు
X

వందే భారత్...భారతదేశంలో క్రేజీ రైలు ఇది. అత్యంత వేగంగా, తక్కువ టైమ్ లో రీచ్ అయ్యే ఈ ట్రైన్ ను ఇండియన్స్ చాలా ఇష్టపడుతున్నారు. వీటి ధరలు ఎక్కువగా ఉన్నా డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ఈ క్రేజీ నెస్ ను మరింత పెంచేందుకు టికెట్ల ధరలను తగ్గిస్తామని భారతీయ రైల్వేస్ అనౌన్స్ చేసింది. కానీ మళ్ళీ అంతలోనే తెలుగు రాష్ట్రాలకు మాత్రం కాదంటూ బాంబు పేల్చింది.

వందే భారత్ లో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచడానికి టికెట్ల ధర తగ్గిస్తున్నామని చెప్పింది. కానీ అందులో ఒక మళ్ళీ ఒక మెలిక పెట్టింది. టికెట్ల తగ్గింపు కేవలం తక్కువ దూరం ఉండే మార్గాల్లో మాత్రమే అంటూ తేల్చి చెప్పింది. పైగా తెలుగు రాష్ట్రాల రూట్ లకు ఇది వర్తించదని స్పష్టం చేశారు. ఇండోర్-భోపాల్ మధ్య తిరుగుతున్న వందే భారత్ రైలు ప్రయాణం కేవలం 3 గంటలు. ఇలాంటి తక్కువ ప్రయాణ సమయాలు ఉన్నవాటికి మాత్రమే టికెట్ల ధర తగ్గింపు వర్తిస్తుంది. తద్వారా ఆక్యుపెన్సీని పెంచాలని భావిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్-విశాఖ, సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైళ్ళు నడుస్తున్నాయి. వీటికి ఆదరణ కూడా ఎక్కువగానే ఉంది. టికెట్ ధర ఎక్కువగానే ఉన్నా జనాలు వీటిల్లో వెళ్ళడానికి మక్కువ చూపిస్తున్నారు. దీంతో ఇక్కడ రైళ్ళకు ధరల తగ్గింపు ప్రతిపాదనలు లేవని స్పష్టత ఇచ్చేశారు రైత్వే అధికారులు. మరోవైపు విజయవాడ-చెన్నై వందే భారత్ రైలు త్వరలోనే ప్రారంభం అవుతుందని అన్నారు. అలాగే సికింద్రాబాద్-పూణె మధ్య కూడా వందే భారత్ రైలును ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.

Updated : 6 July 2023 1:30 PM GMT
Tags:    
Next Story
Share it
Top