‘వందే సాధారణ్’ ట్రయల్ రన్ సక్సెస్.. హైదరాబాద్ To ఢిల్లీకి ఒకటి..
X
‘వందే భారత్’ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రజల నుంచి ఆదరణ రావడంతో కేంద్రం మరో భారీ ప్రాజెక్టును త్వరలోనే అమలు చేయనుంది. తక్కువ చార్జీలు, సౌకర్యమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించే ‘వందే సాధారణ్ ఎక్స్‌ప్రెస్’ పట్టాలెక్కడానికి సిద్ధమైంది. బుధవారం ట్రైన్ ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్త చేశారు. ముంబై నుంచి బయలుదేరిన రైలు అహ్మదాబాద్ ఎలాంటి ఆటంకాలూ లేకండా చేరుకుంది. ఎయిర్ కండిషన్డ్ బోగీలున్న వందే భారత్ తరహాలో మొత్తం నాన్ ఏసీ బోగీలతో వందే సాధారణ్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.
హైదరాబాద్ – న్యూఢిల్లీ రూట్లోనూ ఒకటి ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ ఆలోచిస్తోంది. ముంబై, పట్నా, హౌరాల నుంచి దేశ రాజధానికి, ఎర్నాకులం-గువాహటి మార్గంలోనూ వీటిని దశలవారీగా ప్రవేశపెట్టనున్నారు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ రైళ్లతో మహానగరాల మధ్య ప్రయాణం త్వరగా పూర్తవుతుంది. 22 బోగీలు ఉండే వందే సాధారణ్ రైళ్లలో 1800 మంది ప్రయాణించొచ్చు. స్లీపర్, జనరల్ క్లాసులు అందుబాటులో ఉంటాయి. రెండు ఇంజిన్లతో నడిచే ఈ బండిలో భద్రత కోసం సీసీకెమెరాలను, ప్రమాదాలు జరగకుండా సెన్సాన్సర్లను అమర్చారు.
🚨 India's first Vande Sadharan train on trail run between Mumbai & Ahemdabad. (📸 - Anirudh27K) pic.twitter.com/a0735IZhx2
— Indian Tech & Infra (@IndianTechGuide) November 8, 2023