Vc Sajjanar: 'తలకెక్కిన వెర్రి ఇది'.. వీడియో షేర్ చేసిన సజ్జనార్
X
ఆ రోడ్డుపై కార్లు, బైకులు వేగంగా వెళుతున్నాయి. తన టాలెంట్ ను చూపించడానికే అదే సరైన టైమ్, ప్లేస్ అనుకున్నాడో.. ఏమో.. వేగంగా దూసుకెళ్తున్న బైకుపై నిలబడి ఓ యువకుడు స్టంట్లు చేశాడు. చివరకు దానిపై నుంచి పడి గాయాలపాలయ్యాడు. అంతేగాక రోడ్డుపై ఎదురుగా వస్తున్న మరో బైకర్ ను ప్రాణాపాయ స్థితిలోకి తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.తలకెక్కిన వెర్రి ఇది అని విమర్శలు గుప్పించారు.
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (RTC MD Sajjanar). . తన సోషల్ మీడియాలో సంస్థకు సంబంధించిన సమాచారంతో పాటు.. ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వ్యూస్ కోసం రోడ్లపై ఫీట్లు చేసి ప్రమాదాలకు గురైన వారి వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటారు సజ్జనార్. అలాంటివి చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచిస్తుంటారు.
తాజాగా ఆయన షేర్ చేసిన వీడియోలో.. ఓ యువకుడు తాను నడుపుతున్న బైక్ హ్యాండిల్ ను వదిలేసి దానిపై నిల్చొని వీడియోకు ఫోజు ఇచ్చే ప్రయత్నం చేశాడు. స్పీడ్ మీదున్న ఆ బైక్ పై.. అతని కంట్రోల్ తప్పింది. దీంతో అతడు ఓ పక్కకు కింద పడిపోగా.. బైక్ మరో పక్కకు దూసుకెళ్లింది. అదే సమయంలో రోడ్డుకు అటువైపుగా వస్తున్న మరో బైక్ కు తాకడంతో ఆ బైక్ పై ఉన్న ఇద్దరూ కూడా కింద పడిపోయారు. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో.. కచ్చితమైన సమాచారం తెలియదు కానీ.. ఇలాంటి వారి అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్ల విలువైన ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. రోడ్డుపై తాము చేస్తున్న స్టంట్ల వల్ల ఇతర వాహనాలకు కూడా ప్రమాదం జరుగుతుందన్న విషయాన్నీ పట్టించుకోకుండా కొందరు యువకులు రెచ్చిపోతున్నారు. అనేక రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డవుతున్నాయి.
తలకెక్కిన వెర్రి ఇది!#RoadSafety #Road @tsrtcmdoffice @PROTSRTC pic.twitter.com/OpqTwa275q
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 1, 2023