టమాట రూ.100, పచ్చిమిర్చి రూ.120.. సామాన్యుడికి కూర"గాయలు"
X
కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా టమాట, మిర్చి రేట్ ఘాటెక్కిస్తోంది. కిలో పచ్చిమిరపకాయలు రైతు బజార్లోనే రూ.120 నుంచి రూ.140 పలుకుతోంది. కిలో టమాట కూడా రూ. 80 నుంచి రూ.100 పలుకుతోంది. బీరకాయ, బెండకాయ, దొండకాయ, బీన్స్, వంకాయ ఇలా ఏ కూరగాయలు కొనాలన్నా సామాన్యులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కూరగాయలన్నీ కిలో రూ.60పైనే పలుకుతున్నాయి.
మే నెలలో దేశంలో కిలో టమోటా రూ.2 నుంచి 5 మధ్య పలికింది. కానీ, ఇప్పుడు కిలో టమోటా ధర కేవలం నెల రోజుల్లో 1900 రెట్లు పెరిగింది. కేవలం తెలంగాణ, ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. ఢిల్లీ మార్కెట్లలో కిలో టమోటా రూ.70-100 మధ్య విక్రయిస్తున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలో రూ.80-100 మధ్య ఉండగా, రాజస్థాన్‌లో రూ.90 నుంచి రూ.110 మధ్య, పంజాబ్ లో రూ.60-80 మధ్య పలుకుతోంది.
ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం టమోట సాగుపై ప్రతికూల ప్రభావం చూపింది. దీనికి తోడు పలు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో టమోట తోటలు దెబ్బతిన్నాయి. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి టమోట సరఫరా గణనీయంగా తగ్గింది. కొత్త పంట దిగుబడి రావడానికి కనీసం ఒకట్రెండు నెలలు పడుతుందని రైతులు చెబుతున్నారు. అప్పటి వరకు ఈ రేట్లు తప్పవని అంటున్నారు.
tomato kg costs rs 100 in telangana
telangana,vegetables,tomato,green chilli,rates,middle class,madhya pradesh,uttarpradesh,rajasthan,tomato crop,extreme temparature,rains,price hike