Home > తెలంగాణ > బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్ గూటికి వేముల వీరేశం..!

బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్ గూటికి వేముల వీరేశం..!

బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్ గూటికి వేముల వీరేశం..!
X

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్లో చేరికకు ముహూర్తం ఖరారైంది. శనివారం ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ లో చేరిక నేపథ్యంలో వేముల వీరేశం ఢిల్లీకి పయనమయ్యారు.

గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీపై మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీఎం కేసీఆర్ను కలిసేందుకు ఆయన చాలాసార్లు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ముఖ్యమంత్రి తనకు టికెట్ ఇస్తారని భావించినా.. ఇటీవల ప్రకటించిన పార్టీ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. వీరేశంకు గులాబీ బాస్ మొండిచేయి చూపించడంతో పార్టీ మారితేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న నిర్ణయానికి వచ్చింది.

కొందరు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు సైతం వీరేశంను తమపార్టీలో చేరాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో అనుచరులతో ఈ అంశంపై చర్చించిన వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లిన ఆయన.. శనివారం ఉదయం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

నిజానికి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన సమయంలోనే వేముల వీరేశం చేరిక ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి చేరిక పూర్తైంది. కానీ వేముల వీరేశంకు గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో పార్టీలో చేరిక ఆలస్యమైంది.

Updated : 22 Sept 2023 7:04 PM IST
Tags:    
Next Story
Share it
Top