Home > తెలంగాణ > వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని సంచలన వ్యాఖ్యలు

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని సంచలన వ్యాఖ్యలు

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని సంచలన వ్యాఖ్యలు
X

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీఆర్ఎస్ లో అసంతృప్తులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. పొంగులేటి, జూపల్లి వంటి నేతలు ఇప్పటికే పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ పార్టీలో కొందరు దొంగలు ఉన్నారని.. తనను పక్కకు పెట్టాలని చూస్తున్నారని రమేష్ ఆరోపించారు. ఎమ్మెల్యే టికెట్ తన చేతుల్లో లేదని.. పార్టీ అధిష్టానమే చూసుకుంటుందన్నారు. తనకు పదవులపై వ్యామోహం లేదని.. ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్లు చెప్పారు. కానీ ప్రజల ఆస్తి కాజేయాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

"వేములవాడ నుంచి రమేష్ బాబు వెళ్లి పోయాక స్థలాలు కబ్జా చేయాలని కొందరు చూస్తున్నారు. నా ప్లాన్ నాకు ఉంది. అనునిత్యం ప్రజలతోనే ఉంటాను. నన్ను పక్కకు నెట్టాలని చాలామంది చూస్తున్నారు. నాకు ఏం తెలియదు అనుకుంటున్నారు. కానీ వాళ్లు నా ముందు లాగులు వేసుకున్నవారే. నేను వెళ్లాక మంచివారు రావాలి. కానీ.. దొంగలను రానివ్వద్దు. కలిసికట్టుగా పోరాటం చేద్దాం అంటూ రమేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సొంత పార్టీ నేతలను ఉద్దేశించి చెన్నమనేని రమేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. కాగా వేములవాడలో బీఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న చెన్నమనేని రమేష్‌కు చెక్ పెట్టేందుకు కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వేములవాడలోనే చల్మెడ లక్ష్మీనరసింహారావు సొంతంగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆయన కూడా బీఆర్ఎస్ టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ అధిష్టానం ఎవరికి ఇస్తుందనే ఉత్కంఠ కూడా కొనసాగుతుంది.


Updated : 13 July 2023 1:13 PM GMT
Tags:    
Next Story
Share it
Top