Telangana : ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. వేములవాడ దర్గాకు తాళం
X
Telanganaదేశంలో మతాలకు అతీతమైన, మత సామరస్యాన్ని చాటిచెప్పే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం. ఎందుకంటే హిందూ దేవాలయ ప్రాంగణంలో దర్గా ఉండటమే కాదు, భక్తులచే పూజలు కూడా అందుకుంటుంది. వేములవాడ ఆలయాన్ని దర్శించుకున్న వాళ్లంతా అక్కడి దర్గాకు వెళ్తారు. తాజాగా దర్గా నిర్వాహణ విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. దీంతో మధ్యలో కలుగజేసుకున్న పోలీసులు దర్గాకు తాళం వేశారు. వివరాల్లోకి వెళ్తే..
గత కొంత కాలంగా దర్గా విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఓ వర్గం దర్గా హక్కులు తమకే చెందుతాయని, తాతల కాలం నుంచి తామే సేవ చేస్తున్నట్లు వాదిస్తుంది. దాంతో గత కొన్నేళ్లుగా ఈ దర్గాపై రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ విషయంపై ఓ వర్గం కోర్ట్ ను కూడా ఆశ్రయించింది. తాజాగా ఇరు వర్గాల మధ్య దర్గా నిర్వహణ విషయంలో మరోసారి వివాదం చెలరేగడంతో. ఆలయ ప్రాంగణంలో తోపులాడుకున్నారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను బయటికి పంపారు. దర్గాకు తాళం వేసి.. ఎవరి హక్కులపై సరైన ఆధారాలు, పత్రాలు ఉంటాయో వాళ్లకే హక్కులు చెందుతాయని తెలిపారు.