Home > తెలంగాణ > Vemulawada : వేములవాడ ఆలయంలో అర్జిత సేవలకు తాత్కాలిక బ్రేక్

Vemulawada : వేములవాడ ఆలయంలో అర్జిత సేవలకు తాత్కాలిక బ్రేక్

Vemulawada : వేములవాడ ఆలయంలో అర్జిత సేవలకు తాత్కాలిక బ్రేక్
X

ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో అర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆది, సోమవారాల్లో ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఈవో కృష్ణప్రసాద్‌ తెలిపారు. ఫిబ్రవరి 21నుంచి 24 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర జరగనుంది. ఈ జాతరకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో జాతర పూర్తయ్యేంత వరకు ఆది, సోమవారాల్లో ఆర్జిత సేవలను నిలిపేస్తున్నట్లు చెప్పారు. శుక్ర, శనివారాల్లో సమ్మక్క సారలమ్మ భక్తుల తాకిడి తక్కువగా ఉంటే గర్భగుడిలో అభిషేకం, అన్నపూజల మొక్కులు చెల్లించుకునేందుకు టికెట్లు జారీ చేస్తామన్నారు. ఆర్జిత సేవల వివరాలు దేవస్థానం వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని ఈవో స్పష్టం చేశారు.


Updated : 17 Dec 2023 2:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top