Home > తెలంగాణ > Medigadda barrage: మేడిగడ్డ కుంగిపోవడానికి కారణాలివే.. సంచలనం రేపుతున్న విజిలెన్స్‌ నివేదిక

Medigadda barrage: మేడిగడ్డ కుంగిపోవడానికి కారణాలివే.. సంచలనం రేపుతున్న విజిలెన్స్‌ నివేదిక

Medigadda barrage: మేడిగడ్డ కుంగిపోవడానికి కారణాలివే.. సంచలనం రేపుతున్న విజిలెన్స్‌ నివేదిక
X

కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నివేదికను విడుదల చేశారు. మానవ తప్పిదం వల్లే డ్యామేజీ జరిగినట్టు తేల్చారు. ముఖ్యంగా కాంక్రీట్‌, స్టీల్‌లో నాణ్యత లోపం గుర్తించిన విజిలెన్స్‌.. 2020లోనే మేడిగడ్డ డ్యామేజీ అయినట్టు తేల్చారు. మేడిగడ్డ ప్రారంభమయ్యాక మొద టి వరదకే పగుళ్లు బయటపడ్డాయని వచ్చాయన్నారు. నివేదికలో మేడిగడ్డ కుంగిపోవడానికి మొత్తంగా ఐదు కారణాలు వివరించారు.

నివేదికలో ఉన్న పాయింట్స్ ఇవే..

2020 మే18న మేడిగడ్డ డ్యామేజ్‌ అయింది. డ్యామేజ్‌ అయిన బ్లాక్స్‌ రిపేర్‌ చేయాలని ఏజెన్సీకి చెప్పిన అధికారులు. నాలుగుసార్లు చెప్పినా ఏజెన్సీ పట్టించుకోలేదు. ఐదుసార్లు వరద వచ్చినా మెటీరియల్‌ తీసివేయలేదు. ప్రాజెక్టు ఆరంభం నుంచి నిర్వహణ గాలికొదిలేశారు. వరద వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు కూడా చేయలేదు. షీట్స్‌, RR పిచ్చింగ్‌లు ఏజెన్సీ తొలగించలేదు. క్రాక్స్‌ బ్లాక్‌ నెంబర్‌ 7, 16వ పియర్‌ నుంచి 21వ పియర్‌ వరకు రాఫ్ట్‌ మెటీరియల్‌ కొట్టుకుపోయింది. త్రీడీ మోడల్‌ స్టడీలో ఈ అంశాలు బయటపడ్డాయని నివేదికలో వెల్లడించారు. ఏజెన్సీ అగ్రిమెంట్‌ కండీషన్లు కూడా ఉల్లంఘించిందని, బ్యారేజ్‌ పూర్తయిన తర్వాత ఇరిగేషన్‌ అథారిటీ తనిఖీ కూడా చేయలేదని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తెలిపారు.




Updated : 8 Feb 2024 9:14 PM IST
Tags:    
Next Story
Share it
Top