Home > తెలంగాణ > Branded Rice Bags : హైదరాబాద్ ప్రజలారా.. బ్రాండ్ చూసి బియ్యం కొంటున్నారా?.. అయితే రేషన్ బియ్యం తిన్నట్లే!

Branded Rice Bags : హైదరాబాద్ ప్రజలారా.. బ్రాండ్ చూసి బియ్యం కొంటున్నారా?.. అయితే రేషన్ బియ్యం తిన్నట్లే!

Branded Rice Bags : హైదరాబాద్ ప్రజలారా.. బ్రాండ్ చూసి బియ్యం కొంటున్నారా?.. అయితే రేషన్ బియ్యం తిన్నట్లే!
X

‘షాప్ కి వెళ్లడం. నచ్చిన బ్రాండ్ బియ్యం సెలక్ట్ చేసుకోవడం. కొనేసి.. ఇంటికి తీసుకొచ్చేయడం’ సాధారణంగా అందరికీ ఇదే అలవాటు. తింటుంది మంచి బియ్యమేనా? నిజమైన బ్రాండ్ నే కొంటున్నామా? ఏదైనా కల్తీ జరుగుతుందా? అంటే ఎవరిదగ్గర సమాధానం లేదు. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు హైదరాబాద్ వాసులకు ఓ షాకింగ్ విషయం చెప్పారు. రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి బ్రాండెడ్ పేరుతో ఎక్కువ ధరకు అమ్ముతున్న కొందరిని పట్టుకున్నారు. హైదరాబాద్ సిటీ శివారులో ఏకంగా 10 వేల బస్తాలను సీజ్ చేశారు. స్టీమ్ రైస్ ను పాలిష్ చేసి వివిధ బ్రాండ్ పేర్లతో బస్తాల్లో నింపి అమ్ముతున్న గోదాములపై సివిల్ సప్లయ్స్ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా బియ్యం నిల్వ చేసిన గోదాంలను సీజ్ చేశారు. హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని మైలార్ దేవుపల్లి టాటానగర్ బస్తీలో.. అక్రమంగా బియ్యం నిల్లున్నట్లు అధికారులకు సమాచారం అందింది.

గోదాముల్లోకి వెళ్లి సోదాలు నిర్వహించగా.. ఎలాంటి పత్రాలు లేకుండా గోదాముల్లో పదివేలకు పైగా సోనా మసూరి, బాస్మతి బియ్య బస్తాల నిల్వలను గుర్తించారు. గోదాం ఓనర్ వీరేందర్ పలు రాష్ట్రాల నుంచి మామూలు సోనా మసూరి స్టీమ్ రైస్ ను దిగుమతి చేసుకుని వాటిని పాలిష్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ బియ్యాన్ని రకరకాల బ్రాండ్ల పేరుతో ఉన్న బ్యాగుల్లో నింపి అమ్ముతున్నట్లు నిర్ధారించారు. ఆ బియ్యంలో పీడీఎఫ్ రైస్ ను గుర్తించేందుకు శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ కు పంపించగా.. అసలు విషయం బయటపడింది.

Updated : 29 Feb 2024 3:34 PM IST
Tags:    
Next Story
Share it
Top