Vijayashanti: రాములమ్మకు కాంగ్రెస్ కీలక బాధ్యతలు..!
X
తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. ఆమెకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత కొంత కాలంగా బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై ఆమె అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే పలుసార్లు పార్టీపై బహిరంగ విమర్శలు సైతం చేసిన ఆమె.. ఈ నెల 15న ఆ పార్టీని వీడింది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని.. కేసీఆర్ను గద్దె దించడం కోసమే ఆ పార్టీలో చేరుతున్నట్లు విజయశాంతి ప్రకటించారు.
కాగా తాజాగా ఆమెకు కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార, ప్లానింగ్ కమిటీని నియమించింది. ఆ కమిటీకి చీఫ్ కోఆర్డినేటర్, కన్వీనర్ గా రాములమ్మకు బాధ్యతలు అప్పగించింది. 15 మంది సభ్యులున్న ఈ జాబితాలో మల్లు రవి, కోదండరెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రాములు నాయక్, అనిల్, పుష్ప లీల, సమరసింహారెడ్డి, పిట్ల నాగేశ్వరరావు, రమేశ్ ముదిరాజ్, ఒబేదుల్లా, పారిజాత రెడ్డి, సిద్దేశ్వర్, రామ్మూర్తి నాయక్, దీపక్, ఇబ్రహీంలకు అధిష్టానం చోటు కల్పించింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు విజయశాంతి మీడియాతో మాట్లాడనున్నారు. బీజేపీని విడిన విజయశాంతి మొదటిసారి ప్రెస్ ముందుకు రావడం సవత్రా ఆసక్తి నెలకొంది.