Home > తెలంగాణ > 8 ఏళ్ల బంధానికి ​ఎండ్‌ కార్డ్‌.. విరాట్ కోహ్లీ కాంట్రాక్ట్‌ ముగిసింది

8 ఏళ్ల బంధానికి ​ఎండ్‌ కార్డ్‌.. విరాట్ కోహ్లీ కాంట్రాక్ట్‌ ముగిసింది

8 ఏళ్ల బంధానికి ​ఎండ్‌ కార్డ్‌.. విరాట్ కోహ్లీ కాంట్రాక్ట్‌ ముగిసింది
X

బ్యాడ్ ఫేస్ నుంచి కోలుకున్న విరాట్ కోహ్లీ.. క్రికెట్ లో రీఎంట్రీ ఇచ్చి అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్పుల్లో అదరగొట్టాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ తో గ్రౌండ్ లోకి దిగాడు. ఏడాది తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన టీ20 సిరీస్ లో ఆడాడు. తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఆడాల్సి ఉన్నా.. వ్యక్తిగత కారణాల వల్ల జట్టుకు దూరమయ్యాడు. అయితే ఆ వ్యక్తిగత కారణాలు ఏంటనేది మాత్రం ఎవరికి క్లారిటీ రాలేదు. కొందరు కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడని, అందుకే కొంతకాలం కుటుంబంతో ఉండేందుకు విరామం తీసుకున్నాడని అంటున్నారు. మరికొందరు తన తల్లి అనారోగ్యం వల్ల జట్టుకు దూరమైయ్యారని చెప్తున్నారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని కోహ్లీ సోదరుడు వికాస్ స్పష్టం చేశాడు. ఈ క్రమంలో మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీల 8 ఏళ్ల బందానికి.. త్వరలో ఎండ్ కార్డ్ పడనుంది అని తెలుస్తుంది. అయితే మీరు అనుకున్నట్లు వారి పెళ్లిబందం గురించి కాదు లేండి..

క్రికెట్ లో సూపర్ స్టార్ గా ఎదిగిన విరాట్ కోహ్లీ.. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. దీంతో పెద్ద పెద్ద కంపెనీలు.. కోహ్లీతో తమ బ్రాండ్ ను ప్రమోట్ చేయించుకున్నాయి. పలు బడా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. దాదాపు 8 ఏళ్లుగా కోహ్లీ పూమా బ్రాండ్ కు అంబాసిడర్ గా ఉన్నాడు. దానికోసం ఏడాదికి రూ.110 కోట్లు ముడుపు అందుకున్నాడు. అయితే ఇప్పుడు దాన్నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. కోహ్లీ, పుమా మధ్య​ కాంట్రాక్ట్‌ పూర్తయింది.

పుమా బ్రాండ్ అంబాసిడర్ గా తప్పుకున్న కోహ్లీ.. ఇక నుంచి మరో ప్రముఖ బ్రాండ్‌ అగిలిటాస్ స్పోర్ట్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. దీనికోసం కోహ్లీ డబ్బు కాకుండా.. ఆ సంస్థలోని ఈక్విటీ షేర్లను తీసుకోనున్నాడు. అంటే.. కంపెనీలో కోహ్లీకి కూడా వాటా ఉంటుంది. కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా పుమాకు బ్రాండ్‌ అంబాసిడరే. మరి కోహ్లీ కాంట్రాక్ట్ తో పాటు అనుష్క కాంట్రాక్ట్‌ కూడా ముగిసిందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.





Updated : 8 Feb 2024 12:33 PM GMT
Tags:    
Next Story
Share it
Top