Home > తెలంగాణ > దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న హైదరాబాద్ ఐఐటీ స్టూడెంట్

దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న హైదరాబాద్ ఐఐటీ స్టూడెంట్

దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న హైదరాబాద్ ఐఐటీ స్టూడెంట్
X

దానావత్ కార్తీక్ నాయక్....హైదరాబాద్ ఐఐటీ లో చదువుతన్నాడు. ఉన్నట్టుండి ఎవ్వరికీ చెప్పకుండా కాలేజీ నుంచి పారిపోయాడు. ఎవ్వరికీ దొరక్కుండా తప్పించుకుతిరుగుతున్నాడు. వైజాగ్ లో అనవాళ్ళు కనిపించినా పట్టుకోవడం కష్టమవుతుండడంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు అక్కడి పోలీసులు.

ఈనెల 17న సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ క్యాంపస్ నుంచి మాయం అయ్యాడు కార్తీక్. రెండురోజుల పాటూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి అతని తండ్రి హాస్టల్ వార్డెన్ కు ఫోన్ చేశారు. వెంటనే తనిఖీలు చేస్తే ఎక్కడా కనపడలేదు. తోటి విద్యార్ధులనుఅ డిగితే పక్కనే ఉన్న డాబాలో ఉన్నట్టు చెప్పారు. తనను 20 రూపాయలు అడిగాడని ఒక వద్యార్ధి చెప్పాడు. అక్కడకు వెళ్ళి చూస్తే అక్కడా కనిపించలేదు. దీంతో కాలేజి యాజమాన్యం, తల్లిదండ్రులు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో తరువాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కార్తీక్ జన్మభూమి లో విశాఖ వెళ్ళాడని తెలిసింది.

ఈ విషయం తెలిసన కార్తీక్ తల్లిదండ్రులు విశాఖకు చేరుకున్నారు. స్థానిక పోలీసులతో కలిసి అతనిని వెతుకుతున్నారు. అసలు ఎందుకు పారిపోయాడో తెలియదు అంటూ వారు ఏడుస్తున్నారు. మరోవైపు దొరక్కుండా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు కార్తీక్. ఎక్కడ ఉంటున్నాడో తెలియడం లేదు. అవసరమనప్పుడు మాత్రమే ఫోన్ స్విచ్చాన్ చేస్తున్నాడు. తరువాత అంతా ఆఫ్ చేసి ఉంచుతున్నాడు. ఆన్ చేసినప్పుడు సిగ్నల్స్ ఆధారంగా ఆ ప్లేస్ కి వెళ్ళి చూస్తే అక్కడి నుంచి మాయం అవుతున్నాడు. కేవలం తిండిపదార్ధాలు కొనుక్కునేందుకు మాత్రమే ఫోన్ ఆన్ చేస్తున్నాడు. సీసీ కెమెరాలను చెక్ చేస్తున్నా అతడిని ప్టుటకోవడం కష్టం అవుతోంది. దీంతో విశాఖ పోలీసులు కార్తీక్ మీద లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

అసలు కార్తీక్ ఎందుకు క్యాంపస్ నుంచి బయటకు వచ్చేశాడు అన్న దాని మీద కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అతనికి ఎలాంటి సమస్యలూ లేవని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఐఐటి కోర్స్ ఒత్తిడి భరించలేక , చదవడం ఇష్టం లేక, ఆ క్యాంపస్‌‌లో ఉండడంపై ఆసక్తి లేక వెళ్ళిపోయాడా ఆన్న దానిపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తానికి కార్తీక్ మిస్సింగ్ మిస్టరీగా మారింది.


Updated : 24 July 2023 7:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top