Home > తెలంగాణ > TS Election : ఓటర్ కార్డు లేదా అయితే ఇలా చేయండి..

TS Election : ఓటర్ కార్డు లేదా అయితే ఇలా చేయండి..

TS Election : ఓటర్ కార్డు లేదా అయితే ఇలా చేయండి..
X

ఓటు హక్కు ఉన్నా.. ఓటర్ కార్డు లేదన్న కారణంతో చాలా మంది పోలింగ్కు దూరంగా ఉంటారు. అయితే ఓటర్ కార్డు లేకున్నా ఓటు వేయొచ్చన్న సంగతి చాలమందికి తెలియదు. ఓటర్ కార్డు లేని వారు కేవలం ఎన్నికల కమిషన్ సూచించిన వ్యక్తిగత గుర్తింపు కార్డు ఏది చూపించినా పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేసే అవకాశముంది. గతంలో ఓటరు కార్డు లేకపోతే ఫోటో ఓటర్ స్లిప్తో పాటు ఫొటో గుర్తింపు కార్డులైన ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ తదితరాల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేసే వెసులుబాటు ఉండేది. అయితే ఈసారి బ్యాంకులు , పోస్టాఫీసులు జారీ చేసే ఫోటోతో కూడిన పాస్‌ పుస్తకం చూపించి కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఓటరు ఐడెంటిటీ కార్డుతో పాటు పోల్ స్లిప్ లేకపోతే బీఎల్‌ఓలను సంప్రదించి స్లిప్ తీసుకొని ఓటు వేయవచ్చని ఎన్నికల కమిషన్ చెబుతోంది.

ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డులు ఇవే..

ఆధార్‌ కార్డు

పాస్ పోర్టు

డ్రైవింగ్‌ లైసెన్సు

కేంద్ర, రాష్ట్ర, పబ్లిక్‌ సెక్టార్‌, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల ఫొటో గుర్తింపు కార్డు

బ్యాంకులు, పోస్టాఫీసు జారీ చేసిన పాసుపుస్తకం

పాన్‌ కార్డు

జనగణన ఆధారంగా జారీ చేసిన స్మార్ట్‌కార్డు

ఎంఎన్‌ఆర్‌జీఏ జారీ చేసిన జాబ్‌కార్డు

కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌ కార్డు

ఫొటోతో జత చేసిన పింఛను పత్రాలు

ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం


Updated : 29 Nov 2023 4:26 PM IST
Tags:    
Next Story
Share it
Top