Home > తెలంగాణ > అరగంట జర్నీ ఇక ఐదు నిమిషాల్లో.. స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం అప్పుడే..

అరగంట జర్నీ ఇక ఐదు నిమిషాల్లో.. స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం అప్పుడే..

అరగంట జర్నీ ఇక ఐదు నిమిషాల్లో.. స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం అప్పుడే..
X

హైదరాబాద్ కు తలమానికంగా నిలువనున్న ఇందిరాపార్క్- వీఎస్టీ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్ మీదుగా వీఎస్టీ జంక్షన్ వరకు నిర్మించి అతి పొడవైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాగా, ఈ బ్రిడ్జ్ ను ఆగస్టు 19న ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దాదాపు రూ.450 కోట్లతో 2.6 కిలోమీటర్ల పొడవున్న ఈ స్టీల్ బ్రిడ్జ్ వల్ల ట్రాఫిక్ జామ్ తగ్గుతుంది. అరగంట పాటు పట్టే జర్నీ కేవలం ఐదు నిమిషాల్లో పూర్తవుతుందని కేటీఆర్ అన్నారు. కాగా, బ్రిడ్జ్ కు దివంగత నేత నాయిని నర్సింహా రెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నాయిని పేరు:

రాష్ట్ర తొలి హోంమంత్రిగా, ముషీరాబాద్ ఎమ్మెల్యేగా, వీఎస్టీ వర్కర్స్ యూనియన్ నేతగా అందించిన సేవలకుగానూ.. వీఎస్టీ స్టీల్ బ్రిడ్జ్ కు నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ స్టీల్ బ్రిడ్స్ నిర్మాణానికి 2020 జులై 10న శంఖుస్థాపన జరుగగా.. 2021 జనవరిలో పనులు ప్రారంభమయ్యాయి. 2.6 కిలోమీటర్ల పొడవున్న ఈ స్టీల్ బ్రిడ్జ్ లో మొత్తం 81 స్టీల్ పిల్లర్లు, 46 పైల్ ఫౌండేషన్లు ఉన్నాయి. నాలుగు లేన్లుగా నిర్మించిన దీంట్లో 426 గర్డర్లు ఉన్నాయి. ఈ వంతెన నిర్మాణం వల్ల ఇందిరాపార్క్, ఎన్టీఆర్ స్టేడియం, అశోక్ నగర్, మూవీ థియేటర్ జంక్షన్ ఆర్టీసీ క్రాస్ రోడ్, బస్ భవన్, వీఎస్టీ వరకుండే ట్రాఫిక్ జామ్ సమస్య తీరిపోనుంది.



Updated : 17 Aug 2023 3:23 PM GMT
Tags:    
Next Story
Share it
Top