పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న మెడికో మానస..వేధింపులా? చదువు ఒత్తిడా?
X
ఖమ్మం జిల్లాలో విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. మరో వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఇటీవల వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . ఆ ఘటన మరువకముందే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మొడికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న మరో మొడికో సూసైడ్ చేసుకోవడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. వరంగల్‌కు చెందిన మానస అనే 22 ఏళ్ల మెడికో ఆదివారం రాత్రి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని బలవన్మరణానికి పాల్పడింది. చుట్టుపక్కన వారు గమనించి ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అవేమి ఫలించలేదు. మానస మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మానస సొంతూరు వరంగల్‌లోని పోచమ్మ మైదాన్ ప్రాంతం. ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీలో బీడీఎస్ ఫైనల్ ఇయర చదువుతోంది. కాలేజీ సమీపంలోని ఓ ప్రైవేట్ వసతి గృహంలో నాలుగో అంతస్తులో ఓ గదిలో ఒంటరిగానే ఉంటుంది. ఆదివారం సాయంత్రం వేళ హాస్టల్ లో ఏదో కాలిపోతున్న వాసన రావడంతో హాస్టల్ నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. మానస గది నుంచి పొగలు వస్తుండటంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు అప్పటికే మంటల్లో చిక్కుకొని మానస కాలిపోయింది. దీంతో హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మానస మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అయితే ఈ ఘటనకు ముందు మానస గది నుంచి పెద్దగా అరుపులు వినిపించాయని , ఆ తరువాత ఈ ప్రమాదం జరిగిందని కొంత మంది తెలిపారు. ఈ మధ్యనే మానస తండ్రి చనిపోయారు. ఆయన మరణాన్ని మానస జీర్ణించుకోలేకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో
అయితే ఆమె ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అనే విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు. వేధింపులా? చదువు ఒత్తిడా? లేదా మానసికంగా ఆత్మస్థైర్యం కోల్పోవడం వల్ల ఈ దారుణం జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.