Home > తెలంగాణ > వరంగల్ మెడికో ప్రీతి కేసులో లేటెస్ట్ అప్‎డేట్...హైకోర్టు ఏం చెప్పిందంటే..

వరంగల్ మెడికో ప్రీతి కేసులో లేటెస్ట్ అప్‎డేట్...హైకోర్టు ఏం చెప్పిందంటే..

వరంగల్ మెడికో ప్రీతి కేసులో లేటెస్ట్ అప్‎డేట్...హైకోర్టు ఏం చెప్పిందంటే..
X

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కుదిపేసిన వరంగల్ మెడికో ధరావత్ ప్రీతి సూసైడ్ కేసులో తాజాగా మరో అప్‎డేట్ వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్‌ గురించి హైకోర్టు కాకతీయ మెడికల్ కాలేజీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రీతి కేసులో సస్పెన్షన్‎కు గురైన సీనియర్ స్టూడెంట్ సైఫ్ అలీ వాదనలను ఒకసారి వినాలని కోర్టు ఆదేశించింది. అతని వాదనలు పూర్తైన తర్వాత సస్పెన్షన్ ఉంచాలా? లేదా ఎత్తివేయాలా? అనే దానిపై నిర్ణయం తీసుకోవాలని క్లారిటీ ఇచ్చింది.

వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాలలో ఎండీ అనస్థీషియా స్టూడెంట్‎గా ధరావత్‌ ప్రీతి 2022లో చేరింది. ఆ తర్వాత అనుమానాస్పద స్థితిలో ఫిబ్రవరి 21న ఆత్మహత్య చేసుకుంది." కాలేజీలోని సీనియర్ స్టూడెంట్ సైఫ్‌ ఆమెను వేధింపులకు గురిచేశాడు. సైఫ్‌ తన ఫ్రెండ్స్‎తో కలసి ప్రీతికి విషపూరిత ఇంజక్షన్‌ ఇచ్చాడు. ట్రీట్మెంట్ పొందుతూ ప్రీతి చనిపోయింది. దీనికి కారణమైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలి" అని ప్రీతి పేరెంట్స్ అప్పట్లో ఫిర్యాదులో తెలిపారు.

ఈ కేసులో సైఫ్‌ను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. అంతే కాదు ప్రధాన నిందితుడు కావడంతో పోలీసులు అతడిని అరెస్టు కూడా చేశారు. ఆ తర్వాత తనకు బెయిల్ మంజూరు చేయాలని సైఫ్ కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులోనే తన వాదనలను వినకుండానే కాలేజీ యాజమాన్యం సస్పెండ్‌ చేసిందని ఈ మధ్యనే సైఫ్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. అధికారులు తనను నిర్లక్ష్యం చేయడం వల్లనే హైకోర్టుకు రావాల్సి వచ్చిందని తెలిపాడు. తనపై సస్పెన్షన్‌ ఎత్తివేయాల్సిందిగా కళాశాలకు ఆదేశాలివ్వండంటూ కోర్టును కోరాడు . సైఫ్ పిటిషన్‌పై తాజాగా జస్టిస్‌ సూరేపల్లి నందా విచారణ జరిపారు. కాకతీయ మెడికల్ కాలేజీ యాజమాన్యం సైఫ్‌ వాదనలు పూర్తిగా విన్న తర్వాత తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

Updated : 13 Sep 2023 4:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top