బీఆర్‌ఎస్‌కు మరో ఎదురు దెబ్బ..సీఎం రేవంత్‌ని కలిసిన ఎంపీ పసునూరి
X
బీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు తగులుగుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎంపీలు, కీలక నేతలు పార్టీని వీడగా, తాజాగా వరంగల్ ఎంపీ పసూరి దయాకర్ అదే బాటలో నడుస్తున్నారు. ఇవాళ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. వరంగల్ లోక్ సభ టికెట్ దక్కకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరుతారని సమచారం ఉంది. కాగా చేవేళ్ల, బీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా హస్తం గూటికి చేరుతారని టాక్.
దయాకర్ వరంగల్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మొదటిసారి 2015 లోక్ సభ ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత 2019లో మరోసారి విజయం సాధించారు. కానీ వరంగల్ సీటును ఈసారి కడియం కావ్యకు కేటాయించడంపై దయాకర్ అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన రేవంత్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో ఉన్నారు. ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం సాగుతోంది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.