Home > క్రీడలు > IND vs AUS: సచిన్‌, డివిలియర్స్‪ని వెనక్కి నెట్టి.. వరల్డ్కప్లో ఆల్ టైం రికార్డ్

IND vs AUS: సచిన్‌, డివిలియర్స్‪ని వెనక్కి నెట్టి.. వరల్డ్కప్లో ఆల్ టైం రికార్డ్

IND vs AUS: సచిన్‌, డివిలియర్స్‪ని వెనక్కి నెట్టి.. వరల్డ్కప్లో ఆల్ టైం రికార్డ్
X

వరల్డ్ కప్ మొదలయిందో లేదో.. రికార్డులు బద్దలు అవుతున్నాయి. చైన్నై వేదికగా జరుగుతున్న భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్ లో మరో వరల్డ్ రికార్డ్ బద్దలయింది. ఆసీస్ దిగ్గజం డేవిడ్ వార్నర్ ఆల్ టైం వరల్డ్ కప్ రికార్డ్ ను బద్దలుకొట్టాడు. వరల్డ్ కప్ లో వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. గతంలో సచిన్ టెండూల్కర్, ఏబీ డివిలియర్స్ 20 ఇన్నింగ్స్ ల్లో 1000 పరుగులు పూర్తిచేశారు. అయితే డేవిడ్ వార్నర్ మాత్రం 19 ఇన్నింగ్స్ ల్లోనే వేయి పరుగులు పూర్తి చేశాడు. ఇవాళ్టి ఇన్నింగ్స్ లో వార్నర్ తన వ్యక్తిగత స్కోర్ 8 వద్ద ఈ ఘనత సాధించాడు.





వార్నర్ రికార్డ్ ఇదే మ్యాచ్ లో బద్దలయ్యే అవకాశం ఉంది. ఈ అరుదైన అవకాశాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉంది. ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో 17 ఇన్నింగ్స్ లు ఆడిన రోహిత్ శర్మ.. 978 పరుగులు చేశాడు. రోహిత్ మరో 22 పరుగులు చేస్తే ఈ రికార్డ్ ను తన ఖాతాలోకి వెళ్తుంది. ప్రస్తుతం 49 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన ఆసీస్.. 188 పరుగులు చేసింది.









Updated : 8 Oct 2023 6:32 PM IST
Tags:    
Next Story
Share it
Top