Home > తెలంగాణ > అలర్ట్.,.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

అలర్ట్.,.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఉదయం నుంచి కురుస్తున్న వర్షం

అలర్ట్.,.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
X


రాష్ట్రంలోని పలుచోట్ల ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం రోజున ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో నేడు(సోమవారం) అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఈరోజు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Very Heavy Rains) కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే.. ఇప్పటికే ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఒక ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. విదర్భ నుంచి అంతర్గత కర్ణాటక వరకు ఒక ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ శనివారం నాడే ప్రకటించిన విషయం తెలిసిందే.

భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు భారీ వర్షసూచన జారీ చేసింది. మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో సోమవారం అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నారాయణపేట, జోంగులాబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ ఇచ్చింది.





ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో సోమవారం ఉదయం నుంచి తేలికపాటి వానలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి సోమాజిగూడ, ఖైరతాబాద్ పంజాగుట్ట జూబ్లీహిల్స్ చింతల్ జగద్గిరిగుట్ట శంషాబాద్, రాజేంద్రనగర్, నారాయణగూడ, హైటెక్ సిటీ, మల్కాజిగిరి, ఉప్పల్ తదితర ప్రాంతాలలో చిరుజల్లులు ఇప్పటికే మొదలయ్యాయి.



Updated : 4 Sept 2023 7:39 AM IST
Tags:    
Next Story
Share it
Top