Home > తెలంగాణ > ఖబడ్దార్..మ్యాన్‎హోళ్లు తెరిస్తే ఊచలు లెక్కపెట్టాల్సిందే

ఖబడ్దార్..మ్యాన్‎హోళ్లు తెరిస్తే ఊచలు లెక్కపెట్టాల్సిందే

ఖబడ్దార్..మ్యాన్‎హోళ్లు తెరిస్తే ఊచలు లెక్కపెట్టాల్సిందే
X

గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదవుతోంది. భాగ్యనగరంలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో వీధుల్లోనే నీరు నిలిచిపోతోంది. నగర రోడ్లు జలమయం అవుతున్నాయి. ఈ క్రమంలో కొంత మంది ప్రైవేటు వ్యక్తులు వానల నేపథ్యంలో అనుమతి లేకుండానే ఎక్కడ పడితే అక్కడ మ్యాన్‌హోళ్లను తెరుస్తున్నారు. దీని కారణంగా చాలా ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల భాగ్యనగరంలో నాలాల్లో పడి చిన్నారులు చనిపోయిన ఘటనలు జరిగాయి. చిన్నారుల కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. ఈ నేపథ్యంలో తాజా కురుస్తున్న వర్షాలతో జలమండలి ముందస్తుగా అప్రమత్తమైంది. ఎక్కడ పడితే అక్కడ మ్యాన్‌హోళ్లు తెరిస్తే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.

" అధికారుల అనుమతి లేకుండా ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు మ్యాన్‌హోళ్లు తెరిచినా, మూతలను తొలగించినా జలమండలి చట్టం సెక్షన్‌ 74 ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగనిస్తాం. ఇలాంటి పనులు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. అంతే కాదు క్రిమినల్‌ కేసులను కూడా నమోదు చేస్తాం. ఒక్కోసారి ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి ఫైన్‎తో పాటు కొన్నిసార్లు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. ఇప్పటికే నగరంలోని 22 వేలకుపైగా లోతైన మ్యాన్‌హోళ్లను గుర్తించాం. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా సేఫ్టీ గ్రిల్స్‌ బిగించాము. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌, మాన్‌సూన్‌ సేఫ్టీ టీమ్‌ , సేఫ్టీ ప్రోటోకాల్‌ టీమ్‌ లు స్పెషల్ వెహికల్స్‎లో ఎప్పటికప్పుడు నగరవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఫీల్డ్ లెవెల్‎లో పనిచేసే సిబ్బందికి అవసరమైన అన్ని రక్షణ పరికరాలు అందింస్తున్నాము. ఎక్కడైనా మ్యాన్‌హోల్స్ మరమ్మత్తులు చేయాల్సి ఉన్నా అవి ధ్వంసమైనట్లు కనిపించినా వెంటనే జలమండలి కస్టమర్‌ కేర్‌ నంబరు 155313కి ఫోన్‌ చేసి సమాచారం అందించండి " అని జలమండలి ఎండీ దానకిషోర్‌ శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.

Updated : 11 Sept 2023 4:24 PM IST
Tags:    
Next Story
Share it
Top