అలాంటి తెలంగాణ కావాలి : పవన్ కల్యాణ్
Mic Tv Desk | 2 Jun 2023 10:17 AM IST
X
X
ఎన్నో పోరాటాలు..ఎంతో మంది ప్రాణ త్యాగాలతో ఆవిర్భవించిన రాష్ట్రం తెలంగాణ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అలాంటి పోరాటయోధులందరికీ నివాళులు అర్పిస్తున్నట్లు పవన్ తెలిపారు . ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ పదో ఏట అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ వేదికగా పేదరికం లేని తెలంగాణ ఆవిష్కృతం కావాలని అన్నారు. కర్షకులు, కార్మికులతో పాటు ఈ ప్రతి ఒక్కరూ ఆనందంగా తమ జీవితం సాగించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. తెలంగాణ ఖ్యాతి, కీర్తి అజరామరంగా విలసిల్లాలని కోరుకున్నారు.
Updated : 2 Jun 2023 10:17 AM IST
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire