Home > తెలంగాణ > పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పని ఖతం.. 2సీట్లకే పరిమితం : ఉత్తమ్

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పని ఖతం.. 2సీట్లకే పరిమితం : ఉత్తమ్

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పని ఖతం.. 2సీట్లకే పరిమితం : ఉత్తమ్
X

పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ప్రత్యేక నజర్ పెట్టింది. ఎలాగైన 12 సీట్లకు తగ్గకుండా గెలవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కో ఆర్డినేటర్లను నియమించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనే పార్లమెంట్లోనూ రిపీట్ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మరింత బలహీనమవుతుందన్న మంత్రి.. ఆ పార్టీ 1 లేదా 2 సీట్లకే పరిమితమవుతుందని చెప్పారు.

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని ఉత్తమ్ అన్నారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్భాటాలు తప్ప అభివృద్ధి జరగలేదని చెప్పారు.

సీతారామ ప్రాజెక్టులో కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.7500 కోట్లు ఖర్చు పెడితే.. ఇప్పటివరకు ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వకపోగా.. రూ.90 వేల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు.


Updated : 26 Jan 2024 7:16 PM IST
Tags:    
Next Story
Share it
Top