Home > తెలంగాణ > తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతుంది : భట్టి

తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతుంది : భట్టి

తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతుంది : భట్టి
X

తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతుందని భట్టి విక్రమార్క అన్నారు. 78 స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సంపదను వారికే పంచిపెట్టాలన్న ఉద్ధేశ్యంతోనే ఆరు గ్యారెంటీలు తెచ్చామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గ్యారెంటీలను అమలుచేస్తామన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో మధిర దిశా నిర్దేశించేలా ఉండాలని.. అందుకే తనను నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.

మధిరను ఫాస్ట్ గ్రోయింగ్ నగరంగా మారుస్తామని భట్టి చెప్పారు. మధిరకు ఔటర్ రింగ్ రోడ్డు కోసం మాస్టర్ ప్రణాళికను రూపొందించామన్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. మధిర ప్రజలు తలదించుకునేలా తాను ఎప్పుడూ చిల్లర రాజకీయాలు చేయలేదన్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం రావాలని అదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. ప్రజలు కూడా తమకు అండగా నిలవాలని కోరారు.


Updated : 10 Nov 2023 8:30 PM IST
Tags:    
Next Story
Share it
Top