IND vs AUS: రెండేళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నాం.. మ్యాచ్ లో వర్షం పడితే..?
X
యావత్ భారతదేశ ప్రజల 13 ఏళ్ల కలను చేరుకోవడానికి ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉంది టీమిండియా. మొత్త 150కోట్ల మంది ఆశయాన్ని మన 15 మంది ఆటగాళ్లు తమ భూజాన వేసుకున్నారు. అహ్మదాబాద్ వేదికపై ఆస్ట్రేలియాను ఓడించి కప్ప గెలవాలని ఆశిస్తున్నారు. మరో కొన్ని గంటల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్ కు వర్షం పడుతుందా? వాతావరణం ఎలాం ఉండబోతుంది? మ్యాచ్ జరుగుతుందా? ఏదైనా ఆటంకం కలుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కాగా దీనిపై వాతావరణ శాఖ క్లారిటీ ఇచ్చింది. వర్షం పడే సూజనలు ఏం లేవని స్పష్టం చేసింది. నరేంద్ర మోదీ స్టేడియం పరిధిలో ఆదివారం కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 20, 34°Cగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అతిరథ మహారథుల మధ్య విశ్వ పోరు ఎలాంటి ఆటంకం లేకుండా తుది పోరు జరగనుంది.
రెండేళ్ల నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టాం: రోహిత్
ఆటగాడిగా కంటే కెప్టెన్ గా రోహిత్ శర్మపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. కీలక సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా.. జట్టును ముందుండి నడిపించాలి. అందులో రోహిత్ శర్మ సక్సెస్ అయ్యాడు. బ్యాటింగ్ లో సూపర్ స్టార్ట్ ఇస్తూ జట్టుపై ఒత్తిడిని తగ్గిస్తున్నాడు. బౌలింగ్ చేంజెస్ చేస్తూ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. కెప్టెన్ గా ఈరోజు రోహిత్ కు అగ్ని పరీక్షే. కాగా ఈరోజు కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నామని రోహిత్ అన్నాడు. తాను వన్డే వరల్డ్ కప్స్ చూస్తూ పెరిగానని.. అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ అయినప్పుడే ఈ వరల్డ్ కప్ కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టినట్లు చెప్పుకొచ్చారు. ‘మా బాధ్యతల విషయంలో స్పష్టతతో ఉన్నాం. కోచ్ రాహుల్ ద్రవిడ్ కోసం మేం దీన్ని సాధ్యం కప్పు గెలవాలనుకుంటున్నాం. రేపటి మ్యాచ్ లో పొరపాట్లు చేస్తే గత 10 మ్యాచుల్లో గెలవడం కూడా వృథానే అవుతుంద’ని రోహిత్ చెప్పాడు.