Home > తెలంగాణ > రాష్ట్రంలో మరో మూడునాలుగు రోజుల పాటు వర్షాలు

రాష్ట్రంలో మరో మూడునాలుగు రోజుల పాటు వర్షాలు

రాష్ట్రంలో మరో మూడునాలుగు రోజుల పాటు వర్షాలు
X

రాష్ట్రంలో వరుణుడి ప్రకోపం కొనసాగుతోంది. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నారు. రాష్ట్రంలో మరో 3 - 4 రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెప్పారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

శుక్రవారం నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడుతాయని వాతావరణ శాఖ చెప్పింది. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షపాతం పడే అవకాశముందని అధికారులు చెప్పారు. మరోవైపు గురువారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, వికారాబాద్‌లో భారీ వాన పడింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్‌ జంట నగరాలతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది.

Updated : 7 Sept 2023 4:11 PM IST
Tags:    
Next Story
Share it
Top