Heavy Rains in Telangana: వచ్చే 5 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు
X
"నేటి నుంచి వచ్చే 5 రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది"(Meteorological Department officials). బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఇవాళ్టి నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు హైదరాబాద్ సహ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
తెలంగాణపై ఓ ఉపరితల ఆవర్తనం ఉందనీ.. అది భూమి నుంచి 3.5 కిలోమీటర్ల ఎత్తువరకూ ఉందని వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఉందని తెలిపింది. 29 నాటికి అండమాన్ నికోబార్ ఉత్తరాన మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో ఉదయం 10 గంటల పలు వరకూ ప్రాంతాల్లో జల్లులు కురిసే అవకాశముంది. మధ్యాహ్నం 3 తర్వాత హైదరాబాద్‌లో జల్లులు పడతాయి. రాత్రి 7 నుంచి 12 వరకూ... రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ నెలాఖరు లేదంటే అక్టోబర్ 1 తర్వాత ఇక వర్షాలు పెద్దగా పడవని వాతావరణ అధికారులు చెబుతున్నారు . ఈశాన్య రుతుపవనాలు వెళ్లిపోతాయి కాబట్టి.. వర్షాలకు అవకాశాలు తగ్గిపోతాయని అంటున్నారు.