10వ తరగతి బాలిక ధైర్యానికి కేటీఆర్ ఫిదా
X
సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన ట్విటర్లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఓ పదవ తరగతి విద్యార్థిని ప్రతిభను పొగడ్తలతో ముంచేశారు కేటీఆర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఎక్కడా తడబడకుండా చాలా వివరంగా బాలిక ఎంతో ధైర్యంగా మాట్లాడిన తీరుకు మినిస్టర్ ఫిదా అయ్యారు. దీంతో ఆ విడియోను కేటీఆర్ ట్విటర్లో షేర్ చేశారు. వాట్ ఏ కాన్ఫిడెంట్ అంటూ ఆ బాలికకు కితాబిచ్చారు కేటీఆర్. ప్రాజెక్టు గురించి బాలికకు ఉన్న అవగాహనకు ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వనపర్తికి చెందిన ప్రణవ శ్లోక 10వ తరగతి చదువుతోంది. వీకెండ్ కావడంతో తన పేరెంట్స్‌తో కలిసి స్థానికంగా ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చింది. ప్రాజెక్టును చూసిన బాలిక ఆ తర్వాత బాలిక మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బాలిక ఎంతో ధైర్యంగా ప్రాజెక్టు గురించి వివరించిన తీరు మినిస్టర్ కేటీఆర్‌ను ఆకర్షించింది. ఆమె మాట్లాడిన తీరుకు ఫిదా అయిన కేటీఆర్ ఆ వీడియోను తన ట్విటర్లో షేర్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కేసీఆర్ ప్రభుత్వం రాక ముందు ఆ తర్వాత జిల్లాలో కరువు పరిస్థితుల గురించి ఈ వీడియోలో బాలిక ఎంతో వివరంగా వివరించింది. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులపై ఆమెకు ఉన్న విషయ పరిజ్ఞానానికి వాట్ ఏ కాన్ఫిడెన్స్ అంటూ మంత్రి కితాబిచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ అమ్మాయికి ఉన్న అవగాహాన ప్రతిపక్షాలకు లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
What a confident tone and composed demeanour this young girl Shloka has !!
— KTR (@KTRBRS) September 8, 2023
Her knowledge of the drought like situation pre-Telangana in Mahbubnagar versus the impact of projects like Palamuru - Ranga Reddy Lift irrigation executed by KCR Govt 👏👏
Kudos to her clarity of… https://t.co/xaxdhMKV0R