Home > తెలంగాణ > పోలింగ్ స్టేషన్, పోలింగ్ బూత్ల మధ్య తేడా ఏంటి?

పోలింగ్ స్టేషన్, పోలింగ్ బూత్ల మధ్య తేడా ఏంటి?

పోలింగ్ స్టేషన్, పోలింగ్ బూత్ల మధ్య తేడా ఏంటి?
X

మరికొన్ని గంటల్లో పోలింగ్. అభ్యర్థుల్లో అప్పుడే టెన్షన్ మొదలైంది. ఎవరు గెలుస్తారు.. ఏ పార్టీకి మెజారిటీ వస్తుందని ప్రజల్లో ఆసక్తి మొదలైంది. ఎన్నికల్లో పోలింగ్ రోజు చాలా కీలకమైంది. ఆ రోజే ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమకు నచ్చిన అభ్యర్థికి ఓటేస్తారు. అయితే పోలిగ్ స్టేషన్, పోలింగ్ బూత్ కు మధ్యున్న తేడా చాలామందికి తెలియదు. పోలింగ్ స్టేషన్ అంటే ఓటింగ్ నిర్వహించే భవనం లేదా ప్రాంగణం అని. పోలింగ్ స్టేషన్లలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోలింగ్ బూత్ లుంటాయి. పోలింగ్ బూత్ అంటే ఓటర్లు ఓటేసేందుకు ఏర్పాటుచేసిన చిన్న గది లాంటి ప్రదేశం అని. అందులో ఓటర్లు వ్యక్తిగతంగా ఓటేస్తారు. పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ‘ప్రజాప్రాతినిధ్య చట్టం 1951’లో నిబంధనలు ఉంటాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా వీటి విషయంలో కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది.

Updated : 29 Nov 2023 10:55 AM IST
Tags:    
Next Story
Share it
Top