అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే..ఎవరిని విజేతగా అనౌన్స్ చేస్తారు..?
X
తెలంగాణ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 119 నియోజకవర్గాల్లోని 2290 మంది అభ్యర్థుల భవితవ్యం కాసేపట్లో తేలనుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో తొలి రౌండ్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. మధ్యాహ్నం వరకు ఏ పార్టీ అధికారంలోకి రానుంది అన్నదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ రసవత్తరంగా కొనసాగుతున్న వేళ ప్రస్తుతం నోటా గురించి ప్రత్యేక చర్చ జరుగుతోంది. నోటాకు సంబంధించిన ఓటర్లలో పలు అనుమానాలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లోపొలిటికల్ పార్టీలు నిలబెట్టిన క్యాండిడేట్లతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవ్వరూ నచ్చని పక్షంలో.. వీరికి ఓటు వేయటం కూడా వృథా అనుకునే ఓటర్లు లేకపోలేదు. అలాంటి వారి కోసమే ఎలక్షన్ కమిషన్ నోటా అనే ఆప్షన్ తీసుకువచ్చింది. అయితే..ఎన్నికల్లో నోటాకు అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు వస్తే.. ఎవరిని విజేతగా అనౌన్స్ చేస్తారన్నదానిపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
భారత్లో తొలిసారిగా 1982లో కేరళలోని ఉత్తర పరవూర్ అసెంబ్లీ నియోజకవర్గం బై ఎలక్షన్లలో ఎన్నికల్ కమిషన్ ఈవీఎంలను అందుబాటులోకి తీసుకువచ్చింది. 2004 లోక్‌సభ ఎలక్షన్ల నుంచి దేశవ్యాప్తంగా ప్రతి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్లలో పూర్తిగా ఈవీఎంల ద్వారానే ఓటింగ్ ప్రక్రియను నిర్వహించింది. అనంతరం 2014 లోక్‌సభ ఎలక్షన్లలో 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో VVPAT సిస్టమ్‌తో కూడిన EVMలను వినియోగించారు. 2013 అసెంబ్లీ ఎలక్షన్లలో ఈవీఎంలో మొదటిసారిగా నోటాను ఇంట్రడ్యూజ్ చేశారు. NOTA అంటే నన్ ఆఫ్ ది ఎబోవ్ అని అర్థం. ఇక 2013న జరిగిన ఎలక్షన్లలో NOTA కు ఓటు వేసేలా చూడాలని ఉన్నతన్యాయస్థానం తీర్పును ఇచ్చింది. అన్ని ఈవీఎంలలో ఈ నోటా ఆప్షన్ చివర్లో ఉంటుంది. తన నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పోటీ చేసే ఏ అభ్యర్థి నచ్చకపోయినా ఈ నోటా బటన్ ప్రెస్ చేసి తమ ఓటు వేసి నిరసనను వ్యక్తం అవకాశాన్ని ఎలక్షన్ కమిషన్ ఓటర్లకు కల్పించింది.
కౌంటింగ్ సమయంలో మిగతా ఓటర్లకు పోలైన ఓట్లతో పాటు నోటాకు వచ్చిన ఓట్లను కూడా ఎన్నికల అధికారులు కౌంట్ చేస్తారు. అయితే.. ఈ ఓట్లను అధికారులు అదనపు ఓట్లుగా పరిగణిస్తారు.ఎలక్షన్స్ రూల్స్ ప్రకారం 100 ఓట్లలో 99 ఓట్లు నోటాకు పడి.. ఒక అభ్యర్థికి ఒక ఓటు వస్తే.. ఆ అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. మిగిలిన ఓట్లను చెల్లవు. అసెంబ్లీ లేదా లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులందరికీ డిపాజిట్లు గల్లంతైతే.. ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని కూడా విజేతగా అనౌన్స్ చేస్తారు.
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మినహా వేరే పార్టీల అభ్యర్థుల ఓట్ల కంటే నోటాకే అధికంగా ఓట్లు రావటం గమనించాల్సిన విషయం. ఈ మధ్యనే జరిగిన గుజరాత్ ఎన్నికల్లోనూ 5.5 లక్షలకు పైగా ఓట్లు నోటాకు వచ్చాయి. చాలా వరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నోటా ఓట్ల కంటే తక్కువ ఓట్లు పోలై.. విజయం సాధించటం విచారకరమైన విషయం.
2018 లో హర్యానాలోని ఐదు జిల్లాల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నోటాకు అధిక ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరినీ అనర్హులుగా అనౌన్స్ చేశారు. దీంతో తప్పక మళ్లీ ఎలక్షన్లు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. మళ్లీ ఎన్నికల్లో నోటాకే ఎక్కువ ఓట్లు రాగా.. రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థిని విజేతగా అనౌన్స్ చేశారు. అలాగే నోటాకు అభ్యర్థికి సమానంగా ఓట్లు వచ్చిన సందర్భాల్లో..పోటీ చేసిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు.