తెలంగాణ కేబినెట్పై ఉత్కంఠ.. ఛాన్స్ దక్కేది వీరికేనా..?
X
గురువారం కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వంలో సామాజిక న్యాయం పాటించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర కేబినెట్‌తో పాటు ఇతర కీలక పదవుల్లో ఆయా వర్గాలకు ప్రాధాన్యం కల్పించేలా కసరత్తు చేస్తోంది. మంత్రి వర్గ కూర్పుపై కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డితో పాటు ఆరుగురు మంత్రులు మాత్రమే ప్రమాణం చేస్తారని సమాచారం. వారిలో ఒకరు డిప్యూటీ సీఎం, ఐదుగురు మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ ఎవరన్న నిర్ణయం పూర్తైన తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు?
1. రేవంత్ రెడ్డి - సీఎం
2. భట్టి విక్రమార్క - డిప్యూటీ సీఎం
3. దామోదర రాజనర్సింహ
4.గడ్డం వివేక్
5. సీతక్క
6. పొన్నం ప్రభాకర్
7. కొండా సురేఖ
8. ఉత్తం కుమార్ రెడ్డి
9. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
10. కోమటి రెడ్డి వెంకట రెడ్డి
11. మల్ రెడ్డి రంగారెడ్డి
12. తుమ్మల నాగేశ్వర రావు
13. దుద్దిల్ల శ్రీధర్ బాబు
14. షబ్బీర్ ఆలీ
15. జూపల్లి కృష్ణారావు
16. శ్రీహరి ముదిరాజ్
17. వీర్లపల్లి శంకర్
స్పీకర్ : రేవూరి ప్రకాశ్ రెడ్డి