Home > తెలంగాణ > చారిత్రాత్మక ఘట్టానికి రాష్ట్రపతిని ఎందుకు పిలవలేదు?... బీఆర్ఎస్ నేత

చారిత్రాత్మక ఘట్టానికి రాష్ట్రపతిని ఎందుకు పిలవలేదు?... బీఆర్ఎస్ నేత

చారిత్రాత్మక ఘట్టానికి రాష్ట్రపతిని ఎందుకు పిలవలేదు?... బీఆర్ఎస్ నేత
X

భారత దేశ చరిత్రలో మరో అద్భుతమైన దృశ్యం ఇవాళ ఆవిష్కృతమైంది. కొత్త పార్లమెంటు భవనంలో ఉభయ సభలు కొలువుదీరాయి. పాత బిల్డింగులోని సెంట్రల్ హాల్లో మోదీ చివరి ప్రసంగం అనంతరం లోక్సభ, రాజ్యసభ సభ్యులు కొత్త పార్లమెంటుకు వెళ్లారు. సభ్యులంతా ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేస్తూ కొత్త భవనంలో అడుగుపెట్టారు. అయితే కేంద్ర సర్కార్ చేపట్టిన ఇంతటి చారిత్రాత్మకమైన వేడుకలో మాత్రం ఓ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్కడా కనిపించకపోవడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రతిపక్షాలు కేంద్ర సర్కార్‎ను టార్గెట్ చేశాయి. రాష్ట్రపతిని ఎందుకు ఈ వేడుకకు ఆహ్వానించలేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఆమె పట్ల వివక్ష ఎందుకని నిలదీస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్, బీఆర్ఎస్ నేత వై.సతీష్ రెడ్డి ట్విటర్ వేదికగా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. "ద్రౌపది ముర్ము ఆమె అధికారిక నివాసంలో అందుబాటులో ఉన్నారు. ఆమె బాగానే ఉన్నారు. అయితే ఈ రోజు జరిగిన హిస్టారిక్ ఫంక్షన్‎లో ఆమె ఎక్కడా కనిపించలేదు. ఆమె పట్ల ఈ వివక్ష, నిర్లక్ష్యం ఎందుకు" అని సతీష్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. అదే విధంగా ఈ విషయంపై టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ స్పందించారు. భారత రాష్ట్రపతి ఎక్కడ ఉన్నారు? ఆమెను ఆహ్వానించారా? ఎందుకు నిర్లక్ష్యం చేశారు అంటూ ప్రశ్నించారు.

Updated : 19 Sept 2023 9:30 PM IST
Tags:    
Next Story
Share it
Top