Home > తెలంగాణ > "50 ఏళ్ల మహిళకు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వాల్సిన అవసరం లేదు"

"50 ఏళ్ల మహిళకు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వాల్సిన అవసరం లేదు"

50 ఏళ్ల మహిళకు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వాల్సిన అవసరం లేదు
X

కాంగ్రెస్ మాజీ చీఫ్, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన ఆరోపణల వివాదం ఇప్పటికే రాహుల్ గాంధీని అతలాకుతలం చేస్తోంది. అయితే ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ నేత, బీహార్ ఎమ్మెల్యే ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాహుల్ ను మరింత చిక్కుల్లో పడేసినట్లయింది. తమ నేతకు అమ్మాయిలకు కొదవలేదని, ఆయన ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవడానికి చాలామంది యువతులు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే నీతూ సింగ్ అన్నారు. అలాంటపుడు యాభై ఏళ్ల వృద్ధురాలికి ఫ్లయింగ్ కిస్ ఇవ్వాల్సిన అవసరం రాహుల్ గాంధీకి ఏముందని ఎదురు ప్రశ్నించారు.





ఈమేరకు ఎమ్మెల్యే నీతూ సింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ లీడర్ పై బీజేపీ కావాలనే, నిరాధార ఆరోపణలతో బురదజల్లుతోందని నీతూ సింగ్ ఈ వీడియోలో మండిపడ్డారు. కాగా, నీతూ సింగ్ వీడియోపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా స్పందిస్తూ స్మృతి ఇరానీపై నీతూ సింగ్ చేసిన వ్యాఖ్యలను ‘సిగ్గుచేటు’ అని పేర్కొన్నారు. నీతూసింగ్ తీరు అవమానకరంగా ఉందని విమర్శించారు. మరో నేత షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ, కాంగ్రెస్ ‘మహిళా వ్యతిరేక పార్టీ’ అని, దాని నాయకుడు రాహుల్ గాంధీని రక్షించడానికి అది ఎంతవరకైనా వెళ్లగలదని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీని కాపాడుకోవడానికి ఆ పార్టీ నేతలు ఎంతకైనా దిగజారుతారని విమర్శించారు.








Updated : 11 Aug 2023 11:11 AM IST
Tags:    
Next Story
Share it
Top