Home > తెలంగాణ > పురుగుల మందు తాగుతూ దంపతుల సెల్ఫీ వీడియో.. ఆ తర్వాత..

పురుగుల మందు తాగుతూ దంపతుల సెల్ఫీ వీడియో.. ఆ తర్వాత..

పురుగుల మందు తాగుతూ దంపతుల సెల్ఫీ వీడియో.. ఆ తర్వాత..
X

జనగామ జిల్లా నర్మెట్ట మండలంలో విషాదం చోటుచేసుకుంది. సూర్యబండ తండాకు చెందిన దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. వారిని స్థానికులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది.

భూక్య గురు, సునీతకు ఒక ఎకరా 9 గుంటల భూమి ఉంది. ఈ భూమి వారసత్వంగా వారికి వచ్చినట్లు వీడియోలో దంపతులు తెలిపారు. అయితే ఈ భూమి విషయంలో కొంత మంది తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ‘‘ మా భూమిని వాళ్ల భూమి అని అంటున్నారు. వారికి తండావాసులు కూడా మద్ధతు పలికారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటున్నాం. మేం చనిపోయాక భూమిని మా పిల్లల పేరుమీదకు మార్చండి ’’ అంటూ వీడియోలో వాపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.

Updated : 13 Aug 2023 3:41 PM IST
Tags:    
Next Story
Share it
Top