Home > తెలంగాణ > భార్యను చంపి పారిపోతుంటే వెంటాడిన కర్మ..

భార్యను చంపి పారిపోతుంటే వెంటాడిన కర్మ..

భార్యను చంపి పారిపోతుంటే వెంటాడిన కర్మ..
X

కర్మ ఎవరనీ వదిలిపెట్టదు.. దూల తీర్చేస్తది.. అని పెద్దలు అంటుంటారు. తాజాగా ఓ వ్యక్తి విషయంలో అదే జరిగింది. తాను చేసిన పనికి కర్మ ఫలం అనుభవించాడు. కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త.. బైక్ మీద పారిపోతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆదిలాబాద్లోని బంగారిగూడలో జరిగింది.

భరత్ అరుణ్ అనే యువకుడికి బాల్కొండకు చెందిన దీప్తి అనే అమ్మాయితో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇవాళ కూడా వీరిద్దరి మధ్య గొడవ జరగగా కోపోద్రిక్తుడైన అరుణ్.. భార్యను చంపేశాడు. ఆ తర్వాత బైక్ మీద పారిపోతూ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఎక్కడ దొరికిపోతాననే భయంలో బైక్ను నడపడంతో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. భార్యభర్తల మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.


Updated : 1 Sept 2023 3:42 PM IST
Tags:    
Next Story
Share it
Top