కాంగ్రెస్‌లోనే చనిపోతా..ఎంపీ కేశవరావు కామెంట్స్
X
ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో ఎంపీ, బీఆర్‌ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు భేటీ ముగిసింది. పార్పీ మార్పు అంశాన్ని కేసీఆర్‌కు కేకే తెలిపారు. దీంతో కేకే తీరుపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారం అనుభవించి, ఇప్పుడు పార్టీ మారడం సరికాదని పార్టీలో మీకు ఏం తక్కువ చేశామని? మీ ఆలోచన చాలా తప్పు మీరే ఆలోచించుకోండి అని సూచించారు. అయితే తాను కాంగ్రెస్‌లో చనిపోతానని కేకే చెప్పారు. పార్టీ మార్పు వార్తలు విస్తృతం కావడంతో గురువారం కేకేతో పాటు ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీని ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు పిలిపించుకొని కేసీఆర్ మాట్లాడారు.
అయితే, కేకేతో కేసీఆర్ జరిపిన చర్చలు విఫలం అయినట్లు తెలుస్తోంది. ఆయన ప్రతిపాదనపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఏఐసీసీ ఇన్ఛార్జీ దీపా దాస్ మున్షీ, కేశవరావు, ఆయన కూతురు మేయర్ గద్వాల విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వాంచిన సంగతి తెలిసిందే. కేకే కాంగ్రెస్‌లో చేరే తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాసేపటి క్రితమే కేకే ఎర్రవల్లిలోని ఫామ్‌హోస్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. పార్టీ మారేందుకు ఆయన అనుమతి తీసుకునేందుకు కేకే వెళ్లినట్లు తెలుస్తోంది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.