Home > తెలంగాణ > కవిత పిటిషన్‎పై ఇవాళ కోర్టులో విచారణ

కవిత పిటిషన్‎పై ఇవాళ కోర్టులో విచారణ

కవిత పిటిషన్‎పై ఇవాళ కోర్టులో విచారణ
X

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఈడీ వేడి రాజుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ గురువారం మళ్లీ నోటీసులు పంపించింది. శుక్రవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మరి ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరవుతారా?లేదా? అనేదానిపైనే ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈడీ నోటీసులపై కవిత న్యాయ సలహాను కోరారు. ఢిల్లీకి ఎమ్మెల్సీ కవిత లీగల్ సెల్ లాయర్లు వెళ్లారు. న్యాయవాదులు కవిత లేఖను ఈడీకి అందించనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈడీ నోటీసులను కవిత అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఇవాళ సుప్రీంలో కవిత పిటిషన్‏పై విచారణ జరగనుంది. కేసు పెండింగ్‎లో ఉండగా నోటీసులు ఎలా పంపిస్తారు అని కవిత ప్రశ్నించారు. మహిళలను ఈడీ ఆఫీస్‎కు పిలవకూడదన్న కేసులో ప్రస్తుతం విచారణ జరగనుంది. కవిత పిటిషన్ ఇవాళ త్రిసభ్య ధర్మాసనం ముందుకు రానుంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు దుళియా జస్టిస్ అరవింద్ కుమార్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం వాదనలను వినబోతోంది. కవిత తరపున ప్రముఖ సీనియర్ లాయర్ విక్రమ్ చౌదరీ వాదనలు వినిపించనున్నారు.

Updated : 15 Sept 2023 8:36 AM IST
Tags:    
Next Story
Share it
Top