Wine Shops Closed : మందుబాబులకు షాక్.. హైదరాబాద్లో వైన్ షాప్స్ బంద్
Krishna | 2 Dec 2023 3:20 PM IST
X
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో రేపు హైదరాబాద్ వ్యాప్తంగా వైన్ షాపులు మూసివేయాలని సీపీ సందీప్ శాండిల్యా ఆదేశించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్‌లు, క్లబ్‌లు మూసివేయాలని సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా రోడ్లపై బాణాసంచ కాల్చడం వంటి వాటిపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లఘించేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 49 చోట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది.
Updated : 2 Dec 2023 3:20 PM IST
Tags: wine shops wines wines closed wine shops closed wines closed in hyderabad wines closed in telangana telangana wines closed telangana elections telangana election counting hyderabad police telangana police
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire